పబ్జీ గేమ్‌కు మన దేశంలో ఉన్న క్రేజ్ అంతో ఇంతో కాదు. ఓ రేంజ్‌లో ఈ గేమ్‌ను ఆడటానికి యువత చాలా ఇష్టపడుతోంది. భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 117 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విధితమే. అందులో పబ్జీ గేమ్ కూడా ఉంది. సెప్టెంబర్ నుంచి పబ్జీ గేమ్ సేవలు నిలిచిపోయాయి. అయితే మొదట్లో ఈ గేమ్‌పై నిషేధం విధించినప్పటికీ ఐఎస్పీ పరంగా నిషేధం కాలేదు. అప్పటికే ఆ గేమ్‌ను తమ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నవారు నిషేధం ఉన్న కానీ గేమ్‌ను ఆడుతూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం పబ్జీ గేమ్‌కు చెందిన పూర్తి సేవలను కేంద్రం నిలిపివేసింది. ఈ తరుణంలో మళ్లీ ఈ గేమ్‌ను భారత్‌లో తీసుకొచ్చేందుకు పబ్జీ కార్పొరేషన్ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. గేమర్ల సమాచారంను పరిరక్షించేందుకు వారి డేటా ఉండే స్టోరేజీ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అడిట్ చేస్తామని తెలిపింది. త్వరలో పబ్జీ గేమ్ ను భారత గేమర్లకు అందించనున్నది.
పబ్జీ మొబైల్ గేమ్ ఇండియా పేరుతో గేమ్‌ను ప్రారంభించనున్నట్లు పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది. భారతప్రభుత్వ నిబంధనలకు లోపబడి ఈ గేమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. గేమ్‌లో మరికొన్ని మార్పులు కూడా చేయబోతున్నట్లు ప్రకటించింది. కొన్ని కఠినమైన నిబంధనలను కూడా గేమ్ ప్రియుల కోసం అమలు చేయనున్నారు. గేమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిమిత గంటల సమయం దాటితే దానంతట అదే గేమ్ ఆగిపోయేలా నిబంధనలు మార్చుతున్నారు. ఈ గేమ్‌కు సంబంధించి పబ్జీ కార్పొరేషన్ రూ.746 కోట్ల పెట్టుబడి పెడుతోంది. గేమ్‌ను ప్రారంభిస్తామని చెప్పింది కానీ గేమర్లకు అది ఎప్పుడు లాంచ్ చేస్తుందో మాత్రం పబ్జీ కార్పొరేషన్ తెలుపలేదు.











