ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమాకి ఎంతటి క్రేజ్ ఏర్పడిందో తెలిసిందే. అయితే.. ఈ సినిమాని డిసెంబర్ 17న రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. రిలీజ్ డేట్ దగ్గరకొచ్చేసరికి టెన్షన్ టెన్షన్ పడుతూ రిలీజ్ చేశారు. మలయాళం వెర్షెన్ అయితే.. ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేశారు.
బాలీవుడ్ లో పుష్ప విడుదల అడ్డంకులు ఏర్పడడంతో అసలు హిందీ వెర్షన్ విడుదల అవుతుందా..? అవ్వదా..? అనేది లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ గా ఉంది. ఆఖరికి హిందీ వెర్షన్ అడ్డంకులను దాటుకుని రిలీజ్ అయ్యింది. ఈ విషయం గురించి చిత్ర నిర్మాతలు స్పందిస్తూ.. పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. ఇది మా మిస్టేకే. ఇక నుంచి రిలీజ్ విషయంలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. పుష్ప పార్ట్ 2 విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. పుష్ప పార్ట్ 2 షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ చేస్తాం.
పుష్ప పార్ట్ 2 షూటింగ్, అలాగే కంప్లీట్ వర్క్ అంతా రిలీజ్ కి రెండు నెలల ముందే కంప్లీట్ చేస్తాం అని అందరికి మాట ఇస్తున్నాం అని నిర్మాత నవీన్ తెలియచేశారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ.. ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. నైజాంలో ఏరియాలో 11.44 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఫస్ట్ వీక్ ఎంత కలెక్ట్ చేయనుంది అనేది ఆసక్తిగా మారింది.
Must Read ;- సమంత ఊ అనడానికి చైతన్యే కారణమా?











