స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్ప చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఫస్ట్ పార్ట్ ఇంకా 25 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చే్స్తున్నారు. ఈ 25 రోజుల షూటింగ్ ను రెండు షెడ్యూల్ లో పూర్తి చేయనున్నట్టు తెలిసింది.
ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా టైమ్ తీసుకుంటుందట. అందుచేత పుష్ప ఫస్ట్ పార్ట్ 1ను ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ అది కుదిరేలా లేదంటున్నారు. అందుచేత పుష్ప ఫస్ట్ పార్ట్ 1ను 2022 సంక్రాంతి కానీ.. సమ్మర్ కి కానీ.. రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే.. దీనికి చాలా టైమ్ పట్టేలావుంది. కారణం ఏంటంటే… పుష్ప పార్ట్ 1 తర్వాత బన్నీ మరో సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని బన్నీ స్నేహితుడు, నిర్మాత బన్నీ వాసు ఇటీవల ఇచ్చిన ఇంటర్ వ్యూలో తెలియచేశారు.
అదీ కాకుండా.. పుష్ప పార్ట్ 2 స్టోరీ ఇంకా రెడీగా లేదని మరో వార్త కూడా బయటకు వచ్చింది. మరో విషయం ఏంటంటే.. పుష్ప 1 తర్వాత సుకుమార్ కూడా మరో సినిమా చేయనున్నారు. సింగిల్ పేమెంట్ తో బన్నీ సన్నిహితుడు కేదార్ కు ఓ సినిమా చేయడానికి సుకుమార్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుచేత పుష్ప పార్ట్ 1 2022 సంక్రాంతి కానీ.. సమ్మర్ కి కానీ.. వస్తే పుష్ప పార్ట్ 2 2023 చివరిలో కానీ.. 2024లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ వుంది.
Must Read ;- బన్నీ పుష్ప లేటెస్ట్ ప్లాన్ ఇదే