మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ కాకుండానే గాడ్ ఫాదర్ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చారు. చిరంజీవి హీరోగా రూపొందుతోన్న గాడ్ ఫాదర్ మూవీకి మోహన్ రాజా దర్శకుడు. ఇది మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీకి రీమేక్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం.. హైదరాబాద్, ఊటీలో షూటింగ్ జరుపుకోవడం జరిగింది. చిరు పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చిరు చెల్లెలుగా రమ్యకృష్ణ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి, రమ్యకృష్ణ కలిసి అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు తదితర చిత్రాల కోసం ఇద్దరూ జోడీ కట్టారు. అలాంటిది గాడ్ ఫాదర్ మూవీలో అన్నా చెల్లెలుగా నటిస్తున్నారా..? ఈ వార్త నిజమేనా..? అని ఆలోచనలోపడ్డారు సినీ జనాలు. ఈ వార్త పై ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే… ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చిత్రయూనిట్ చెబుతుంది.
అయితే.. చిరు చెల్లెలు పాత్రను నయనతార చేస్తుందట. ఆమె ఎప్పుడో ఈ సినిమాకి ఓకే చెప్పడం జరిగింది. నయన్ కి భర్తగా సత్యదేవ్ నటించనున్నారు. త్వరలోనే వీరిద్దరి పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. సో.. గాడ్ ఫాదర్ మూవీలో చిరు చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుందనేది అవాస్తవం. అదీ.. సంగతి.
Must Read ;- చిరు, సల్మాన్ కలిసి డ్యాన్స్ చేస్తే..?











