‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అంటూ పుష్ప సినిమాలో సమంత కుర్రకారును వేడెక్కించేసింది. సాధారణంగా హీరోయిన్ గా అగ్రస్థాయికి చేరుకున్నాక ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. అంతా బాగానే ఉంది కానీ ఆ పాటలో ఉండే అర్థం మీదనే నెటిజన్లు ఫోకస్ పెట్టారు. నాగ చైతన్యపై పగ తీర్చుకునేందుకే సమంత ఈ ఐటమ్ సాంగ్ లో నటించిందనేది వారి అభియోగం. ఆమె బోల్డ్ గా చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఈ పాటలో ఆమె స్కీన్ షో మీదనే అందరి దృష్టీ ఉంది.
అసలు ఆమె బోల్డ్ పాత్రలు చేయడం కూడా నాగ చైతన్యకు ఇష్టం లేదు. గతంలో ఆమె సూపర్ డీలక్స్ అనే సినిమాలో కూడా అలాంటి పాత్రే చేసింది. దానికి తోడు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కూడా ఉండనే ఉంది. పైగా ఈ పాట కూడా మగవాళ్లను ఎత్తిపొడిచేలా ఉంది. ‘ఈ పాటలో సమంత డ్యాన్స్ మూవ్ మెంట్స్ అన్నీ నాగ చైతన్యపై పగతీర్చుకునేలానే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఐటమ్ సాంగ్ లో కూడా అంగాంగ ప్రదర్శన చేసింది. ఆమె కురచ దుస్తులు దీన్ని నిరూపిస్తున్నాయి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి సమంత అభిమానులు కూడా ప్రతిస్పందించారు.
‘ఆమె ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసింది. ఆమెను కేవలం ఐటమ్ సాంగ్ కోసమే తీసుకున్నారు. డైరెక్టర్ ఏం అడిగారో ఆమె అదే చేసింది. దీన్ని తీసుకుని నాగ చైతన్య తో ముడిపెట్టడం సరికాదు’ అని సమంతను వెనకేసుకొచ్చారు. సినిమాలో ఎర్రచందనం సిండికేట్ నాయకుడు మంగళం శ్రీను ఇచ్చే పార్టీ నేపథ్యంలో ఈ పాట వస్తుంది. అందరినీ ఈ పాట ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, అఖండలోని జైబాలయ్య కొరియోగ్రాఫర్ భాను, పొలాకి విజయ్ లు ఈ పాట కోసం పనిచేశారు.
సమంత ఎలా ఒప్పుకుంది?
అసలు సమంత ఈ పాట చేయడానికి ఒప్పుకోవడమే ఓ విశేషం. ఈ పాట చేయమని సుకుమార్ అడిగినప్పుడు ఆమె ఒప్పుకోలేదట. కానీ రంగస్థలంలో తనకు మంచి పాత్ర ఇచ్చారన్న గౌరవం ఆమెకు ఉంది. రంగస్థలం చేసినప్పుడు అందులో సమంత హీరోయిన్ అయితే అందులో ఐటమ్ సాంగ్ ను పూజా హెగ్డే చేసింది. ఇందులో కూడా అలాంటి అవకాశం ఉండటంతో సమంతతో చేయిస్తే బాగుంటుందన్న ఆలోచన సుకుమార్ కు వచ్చిందట. ఆమెకు తనే ఎంతో నచ్చచెప్పిన తర్వాతే ఈ పాట చేయడానికి అంగీకరించిందని సుకుమార్ చెప్పారు.
Must Read ;- నిన్న సమంత.. నేడు ప్రియాంక.. అసలేం జరిగింది?











