టాలీవుడ్ లోకి ‘దొరసాని’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దేవరకొండ బ్రదర్ ఆనంద్. తొలి సినిమా నిరాశపరిచినా.. రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మాత్రం జనరంజకమైంది. ఓటీటీలో విడుదలైనప్పటికీ.. హీరోగా ఆనంద్ కెరీర్ కి మంచి బూస్టప్ నిచ్చింది సినిమా. ఇప్పుడు ఆనంద్ ముచ్చటగా మూడో సినిమాకి కమిట్ అవుతున్నాడు. ఈ సినిమాకి ‘పుష్పక విమానం’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. కింగ్ ఆఫ్ హిల్స్ , టాంగా ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మరోసారి ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రోడిగా నటిస్తున్నాడు. ఆనంద్ ఒక బ్యాగ్ తో రివీల్ అవగా.. ఇంకా హీరోయిన్స్ శాన్వీ మేఘన, గీత్ సాయిని, సీనియర్ నరేశ్, ఇన్ స్పెక్టర్ గెటప్ లో సునీల్, గిరి, కిరీటి కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాతో దామోదర అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోన్న పుష్పక విమానం సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఒకప్పటి కమల్, సింగీతం కలయికలో వచ్చిన క్లాసిక్ కామెడీ మూకీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
First Look of @AnandDeverkonda’s #PushpakaVimanam 🌹✈️.
A film that will leave you with FUN and THRILL in theatres this summer…
@TheDeverakonda presents@itsdamodara @SaanveMegghana @GeethSaini @KingofHillEnt@tanga_official @AdityaMusic @GskMedia_PR pic.twitter.com/HOyl9B2FxR— BARaju (@baraju_SuperHit) March 1, 2021