బహుభాషా కోవిదుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి, స్వర్గీయ భారత ప్రధాని పి.వి. నరసింహరావు జీవితం వెండితెర మీదకు ఎక్కబోతోంది. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈయన బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్టు వర్క్ కూడా జరుగుతోంది. ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్’ పతాకంపై ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత తాడివాక రమేష్ నాయుడు దీని నిర్మాణ బాధ్యతలను చేపట్టారు.
ఇందులో పీవీ నరసింహారావు పాత్రను జాతీయ స్థాయిలో సుపరిచితుడైన ఓ సీనియర్ నటుడు పోషిస్తారని చెబుతున్నారు. త్వరలోనే ఆయన పేరు ప్రకటిస్తామంటున్నారు. ఈయన ఇంతకుముందు శ్రీహరి హీరోగా ‘శ్రీశైలం’ సినిమాని నిర్మించారు. అనేక సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన ధవళ సత్యం’ ను ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నారు.
తెలుగుతో పాటు హిందీ, మరికొన్ని ఇతర భాషల్లోనూ ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేస్తారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే సెట్స్ పైకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. వచ్చే ఏడాది పీవీ నరసింహారావు జయంతి రోజైన జూన్ 28నే ఈ సినిమాని విడుదల చేస్తామని నిర్మాత చెబుతున్నారు.
Must Read ;- పీవీ.. మన ఠీవీ!











