తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో విభిన్న పాత్రల్లో లీనమై నటించి ఆమె కంటే ఇంకెవరు అంత అద్భుతంగా నటించలేరు అనిపించారు. సావిత్రి తర్వాత అలాంటి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య. మనవరాళి పెళ్లి సినిమాతో టాలీవుడ్ లో మొదటి సారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా స్టార్ హీరోలందరి సరసనా నటించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సౌందర్య కోలార్ జిల్లా ముల్బాగల్ లోని గంజిగుంటే అనే గ్రామంలో కె.ఎస్. సత్యనారాయణ, మంజుల దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి కన్నడ చిత్ర రచయిత, నిర్మాత. ఆమె తన M.B.B.S బెంగళూరులో చదివారు. మొదటి సంవత్సరం తరువాత చదువు ఆపేశారు. ఆమె చూపులకు అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది కానీ.. వాస్తవానికి కన్నడ అమ్మాయి. అంతేకాదు చాలా చక్కగా తెలుగు మాట్లాడటం ఆమె ప్రత్యేకత. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రతి స్టార్ హీరో తో నటించిన ఈ మహానటి దాదాపు రెండు దశాబ్దాలు పాటు నెంబర్ 1 హీరోయిన్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. ఆమె 12 సంవత్సరాల వ్యవధిలో 100 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది.
ఇది ఇలా ఉండగా ఇపుడు ఆమె వ్యక్తిగత విషయానికి జీవితానికి సంబందించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొన్ని బయట పడ్డాయి. ఇక అసల విషయానికి వస్తే.. సౌందర్య 2003 లో ఆమె బంధువు, తన బాల్య స్నేహితుడు జి.ఎస్. రఘు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీరి ప్రేమని సౌందర్య వాళ్ల ఇంట్లో అమ్మ, నాన్న ఒప్పుకోలేదు కానీ రఘు కోసం వాళ్లని సైతం ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఇక ఆమె సినిమా ద్వారా ఎంతో కష్టపడి సంపాదించినా ఆస్తులు మొత్తం కూడా తన భర్త పేరు మీదనే రాసేసింది. సుమారు 5 సంవత్సరాల వరకు సాగిన వీరి ఇద్దరి దాంపత్య జీవితంలో వీళ్లకి ఎలాంటి సంతానం కలగలేదు.
అయితే.. దురదృష్ట వశాత్తు హెలికాప్టర్ క్రాష్ అయ్యి సౌందర్య చనిపోయింది. ఈ సంఘటన అప్పట్లో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గాయపరిచింది. అయితే.. సౌందర్య కన్నుమూసిన తరువాత ఆమె ఆస్తిన మొత్తాన్ని అనుభవిస్తూ అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని రఘు గోవాలో స్థిరపడ్డాడని సమాచారం. సౌందర్య తల్లిదండ్రులు తమకు చెందాల్సిన ఆస్తులను కూడా రఘు కాజేసి తమని రోడ్డు మీద పడేశాడని కోర్ట్ లో కేసు వేసిన విషయం తెలిసిందే. కానీ కోర్ట్ తీర్పు ఇచ్చాక వాళ్లకి చెందాల్సిన ఆస్తులు ఇస్తానని ఒప్పుకున్న రఘు పూర్తి స్థాయిలో ఇప్పటికి ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది.
Must Read ;- సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!











