గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలకు జనం అల్లాడిపోయారు. రెండు రోజుల నుంచి ఎండలు తగ్గుముఖం పట్టడంతో చల్లని వాతావరణం ఏర్పడింది. రాబోయే రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ కు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గి, మబ్బులు పట్టి వాతావరణం మరింత చల్లగా మారింది. రాబోయే రెండ్రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ పలు వర్షాలు కురవడంతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.
Must Read ;- తెలంగాణలో ‘కరోనా’ తాండవం : వామ్మో.. ఇన్ని కేసులా










