సీఎం కుర్చీ పోతుందనే జగన్ తిరుపతి సభను రద్దు చేసుకున్నారని తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రత్యర్థి వర్గాలపై నాయకులు విమర్శల దాడిని పెంచారు. సీఎం పదవి కోసం చిత్తూరు జిల్లాకు చెందిన బడా నాయకుడు, ఓ వెంకటగరి నేత, విజయనగరం జల్లాకు చెందిన మరో నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దాని కోసం వైసీపీలో ఇప్పటికే ఎవరికి వారు రహస్య మంతనాలు జరుపుతున్నారని అన్నారు. ఈ విషయాలన్నీ తెలిసే జగన్ తిరుపతి సభను రద్దు చేసుకున్నాడని చింతా పేర్కొన్నారు. ప్రస్తుతం దళితులు కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యారని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాజధానిగా ప్రకటించేలా అధిష్టానాన్ని ఒప్పిస్తానని చింతా మోహన్ హామీ ఇచ్చారు. పెరుగుతున్న ధరలు, పరిశ్రమల ప్రవేటీకరణతో ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు.
Must Read ;- జగన్ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చు : చింతా











