కోవిడ్ సెకండ్ వేవ్ ఇప్పుడు దేశాన్ని ఒణికిస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. పలువురు సినీ సెలబ్రిటీస్ కోవిడ్ బారిన పడ్డారు.. కొందరు హీరోలు తమ సినిమాల షూటింగ్స్ రద్దు చేసినట్టు ప్రకటించారు. అయితే తెలుగుచలన చిత్ర నిర్మాతల మండలి .. తక్కువ సంఖ్యలో అంటే 50 మంది కార్మికుల సహాయంతో మాత్రమే షూటింగ్స్ చేసుకోవచ్చని నిర్మాతల్ని కోరిన సంగతి తెలిసిందే.
అందుకే అంత తక్కువ మేన్ పవర్ తో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ భారీ చిత్రం షూటింగ్ చేయడం వీలు కాదు కాబట్టి.. ఈ సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్ . ఇప్పటికి 85 శాతం షూటింగ్ ను పూర్తి చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర బృందానికి.. రామ్ చరణ్, ఆలియా భట్ పై రెండు పాటల్ని, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త షెడ్యూల్ లో పూర్తి చేయాలని నిర్ణయించింది. విజయదశమి కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కాబోతోంది.
Must Read ;- కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కంగానా సినిమా వాయిదా !











