ఆర్ఆర్ఆర్.. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఇది. నందమూరి హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుంటే.. మెగా హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ క్లైమాక్స్ ను ఎన్టీఆర్, చరణ్ లపై చిత్రీకరించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ చిత్రంలో నటిస్తున్న హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీన్ ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్ 8న రిలీజ్ చేయనున్నారని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఇలా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ బయటకు రావడంతో.. జక్కన్న టీమ్ షాక్ అయ్యింది. రిలీజ్ డేట్ లీక్ కావడంతో.. నిజంగానే ఈ డేట్ ని ఫిక్స్ చేశారా.? ఈ డేట్ కే ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేస్తారా.? లేక రిలీజ్ డేట్ మారుస్తారా .? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఆర్ఆర్ఆర్ గురించి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బిగ్ ఎనౌన్స్ మెంట్ రానుందని అఫిషియల్ గా ఎనౌన్స్ మెంట్ రావడంతో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారా..? లేక జనవరి 26న రిలీజ్ చేయనున్న టీజర్ గురించి చెబుతారా.? అని ఆతృతతో ఎదురు చూశారు సినీ జనం.
ఆఖరికి ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడంతో పాటు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చరణ్ గుర్రం పై స్వారీ చేస్తుంటే.. ఎన్టీఆర్ బైక్ పై వెళుతున్నారు. వీరిద్దరూ ఇలా పోటీపడి వెళుతున్నట్టుగా కనిపిస్తున్న ఈ ఫోటో అదిరింది అనేలా ఉంది. ఈ సన్నివేశాన్ని తెర పై చూస్తే.. ఏరేంజ్ లోఉంటుందో ఊహించుకోవచ్చు.
దసరాకి ఆర్ఆర్ఆర్ వస్తుండడంతో దసరాకి రిలీజ్ చేయాలనుకున్న భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ మారనున్నాయి. మరి.. బాహుబలితో చరిత్ర సృష్టించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- షాక్ లో రాజమౌళి సంతోషంలో అభిమానులు
Witness the unstoppable force of fire and water on October 13, 2021. #RRRMovie #RRRFestivalOnOct13th@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @thondankani @RRRMovie @DVVMovies pic.twitter.com/NCIHHXQ8Im
— rajamouli ss (@ssrajamouli) January 25, 2021