మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం సమ్మర్ కి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. 2021 దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు చరణ్ ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి తర్వాత చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. అయితే.. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో నటిస్తున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు అనౌన్స్ చేశారు కానీ.. చరణ్ మాత్రం తదుపరి చిత్రం ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు.

దీంతో చరణ్ నెక్ట్స్ మూవీ ఇతనితోనే అంటూ కొంత మంది దర్శకుల పేర్లు తెర పైకి వచ్చాయి. వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్, గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుముల.. ఇలా కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. వీళ్లు చెప్పిన కథలు విన్నారు కానీ.. ఎవరితోను సినిమా చేస్తానని కన్ ఫర్మ్ చేయలేదు. దీంతో చరణ్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. తాజా వార్త ఏంటంటే.. ‘ధ్రువ 2’ చేయాలనుకుంటున్నారట. ధ్రువ మూవీ ఓరిజినల్ వెర్షన్ డైరెక్టర్ మోహన్ రాజా. ఇప్పుడు మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవితో ‘లూసీఫర్’ రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసి సమ్మర్ కి కంప్లీట్ చేయాలనేది ప్లాన్. ఆతర్వాత చరణ్ తో ‘ధ్రువ 2’ మూవీ చేయాలనుకుంటున్నారని తెలిసింది. మోహన్ రాజా ‘లూసీఫర్’ కంప్లీట్ చేసే లోపు చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. ఆతర్వాత ఇద్దరు కలిసి ‘ధ్రువ 2’ మూవీ చేయనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో కూడా అరవింద్ స్వామి విలన్ గా చేయనున్నారని సమాచారం. చరణ్ ప్లాన్ బాగుంది. త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.
Must Read ;- కొడుకు చరణ్ కోసమే చిరు ఇలా చేస్తున్నారా.?











