రౌద్రం.. రణం.. రుధిరం.. క్లైమాక్స్ దశకు చేరుకుంది. రామోజీ ఫిలింసిటీలో రామరాజు, భీమ్ పాత్రలపై ఈ క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్ఠీఆర్, రామ్ చరణ్ ఈ షూటింగులో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. ఈ క్లైమాక్స్ చిత్రీకరణ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొట్టమొదటి సారిగా రాజమౌళి మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆలస్యం అవుతుండటంతో అటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, ఇటు రామ్ చరణ్ అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో లాక్ అయిపోయినట్లు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో నిరసన కూడా వ్యక్తం చేశారు. రామ్ చరణ్ విషయానికి వస్తే ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాని వేసవికల్లా విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
Must Read ;- చిరూ వాయిస్ తో ఆర్ ఆర్ ఆర్ టీజర్ .. ముహూర్తం ఖరారైనట్టే!
The CLIMAX shoot has begun!
My Ramaraju and Bheem come together to accomplish what they desired to achieve… #RRRMovie #RRR pic.twitter.com/4xaWd52CUR
— rajamouli ss (@ssrajamouli) January 19, 2021











