విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం ‘నారప్ప’ సినిమాను కంప్లీట్ చేసే మూడ్ లో ఉన్నారు. అదే చేత్తో అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ మూవీలో కూడా నటిస్తున్నారు. అంతేకాదు.. ఈ రెండు సినిమాలతో పాటు .. మలయాళ సూపర్ హిట్ ‘దృశ్యం’ 2 రీమేక్ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నారు. ఏడేళ్ళ క్రితం దృశ్యం మొదటి భాగంలో నటించి మంచి హిట్ కొట్టిన వెంకీ.. ఇప్పుడు దాని సీక్వెల్ లో కూడా నటించనుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.
మీనా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వారి పిల్లలుగా మొదటి భాగంలోని వారే నటిస్తుండగా.. ఇతర ముఖ్యపాత్రల్ని మాత్రం ‘దృశ్యం 2’ మాదిరిగానే వేరే వాళ్ళు నటించబోతున్నారు. ఇందు లో భాగంగానే .. ఈ సినిమాలో రానా దగ్గుబాటి నటిస్తూండడం విశేషాన్ని సంతరించుకుంది.
‘దృశ్యం 2’ లో హీరో కుటుంబ సభ్యులు చేసిన నేరాన్ని తిరగతోడి.. వారు చంపేసిన కుర్రోడి శవం ఎక్కడుందో కనిపెట్టే పోలీసాఫీసర్ పాత్రలో మురళీ గోపీ అద్భుతంగా నటించారు. ఇదే పాత్రను తెలుగు లో రానా చేయబోతున్నడనే వార్తలొస్తున్నాయి. ఎప్పటి నుంచో ఒకే స్ర్కీన్ మీద బాబాయ్ అబ్బాయ్ లు కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు. అలాగే.. వెంకీ,రానా కూడా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకున్నారు కానీ .. తగిన కథ కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. ఇప్పుడు ‘దృశ్యం 2’ తో వారి కోరిక తీరబోతోందని తెలుస్తోంది. మలయాళ వెర్షన్ డైరెక్టర్ జీతు జోసెఫ్ నే తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. మరి ఈ సినిమాలో రానా నిజంగానే నటిస్తున్నాడో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Must Read ;- విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’కి శ్రీకారం











