యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేయడం.. సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో అంతకు మించిన భారీ స్కేల్ తో రాజమౌళి ఈ సంచలన చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే భారీగానే రిలీజ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతి కానుకగా ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 10,000 కి పైగా స్క్రీన్స్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అంతే కాకుండా యూఎస్ లో కూడా 2,500 కి పైగా స్క్రీన్ లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
అంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ లో కూడా రికార్డ్ సాధించబోతుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ గా ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచే అవకాశం ఉంది. కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాహుబలి సృష్టించిన చరిత్రను ఆర్ఆర్ఆర్ తిరగరాస్తుందని.. సరికకొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే.. కరోనా వలన థియేటర్లకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గింది. సినీ పరిశ్రమకు బాగా నష్టం వచ్చింది. దీంతో.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏ స్థాయిలో స్పందన వస్తుందో..? ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో అనేది ఆసక్తిగా మారింది.
Must Read ;- సంక్రాంతి కోళ్లు కాదు.. స్టార్లు.. రణమా, శరణమా?











