స్వామి కార్యం స్వకార్యం.. జెమినీ టీవీ గేమ్ షోకి ఇదే ‘తారక్’ మంత్రం. జెమినీ టీవీ ప్రతిష్ఠాత్మకంగా ఈ గేమ్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి షో తరహాలో నాగార్జున మీలో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ మా టీవీలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే గేమ్ షో ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు ద్వితీయార్థం నుంచే ఈ గేమ్ షో ప్రసారం ప్రారంభమవుతుంది. అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పగలిగితే కోటి రూపాయల బహుమతి లభిస్తుంది.
ఈ గేమ్ షోలో పాల్గొని రామ్ చరణ్ కూడా రూ. 25 లక్షలు గెలుచుకున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ట్రిపుల్ ఆర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గేమ్ షోలో కూడా పాల్గొంటే ఈ షోకు మరింత అందం లభిస్తుంది. అది జెమినీ టీవీకి పెద్ద ప్రచారంగానూ మారుతుంది. పైగా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రచారానికి కూడా ఇది తోడ్పడుతుంది. స్వామి కార్యం స్వకార్యం అంటే ఇదేమరి. పైగా దర్శకుడు రాజమౌళి కూడా ఆగస్టు నుంచి ట్రిపుల్ ఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నారు. తరచూ అప్ డేట్స్ రాబోతున్నాయి. అక్టోబరు 13న ఈ సినిమా విడుదలకాబోతోంది. ఈ రెండు నెలల్లోనూ కావలసినంత ప్రచారాన్ని ఈ ఇద్దరు హీరోలూ సంపాదించి పెట్టబోతున్నారు.
ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ రామ్ చరణ్
ఈ గేమ్ షో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ రామ్ చరణ్ అంటున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ గేమ్ షో ప్రారంభమవుతుంది. ఇప్పటికే 16 ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తిచేశారట. రామ్ చరణ్ ను గెస్ట్ గా పిలిచిన ఎపిసోడ్ షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని, రామ్ చరణ్ రూ. 25 లక్షలు బహుమతిగా గెలుచుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ లో రాజమౌళి కూడా పాల్గొనే అవకాశం ఉంది. రామ్ చరణ్ తో చేసిందిగానీ, రాజమౌళితో చేసింది గానీ స్పెషల్ ఎపిసోడ్స్ కిందికి వస్తాయి.
రామ్ చరణ్ ఎపిసోడ్ ను ఆగస్టు 16న ప్రసారం చేయనున్నారట. ఆ తర్వాత సాధారణ గెస్ట్ లు ఉంటారు. అప్పుడప్పుడూ స్పెషల్ గెస్ట్ లు కూడా వస్తుంటారు. హోస్ట్ గా ఎన్టీఆర్ ఏమిటో బిగ్ బాస్ లోనే ప్రూవ్ అయ్యింది కాబట్టి ఈ షో కూడా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. మరి కొమరం భీమ్, అల్లూరి సీతారామ్ రాజులు పాల్గొనే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కోసం మనం ఆగస్టు 16 దాకా వేచి చూడక తప్పదు. కచ్చితంగా ఇది మల్టీస్టారర్ షో అవుతుంది.
Must Read ;- ఆగస్టు 1న ట్రిపుల్ ఆర్ మొదటి పాట











