బాహుబలితో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండడం… అది కూడా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండడంతో మెగా అభిమానులు, నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా.. సినీ అబిమానులు అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయ్యింది. దీంతో ఆర్ఆర్ఆర్ అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే.. అభిమానులు ఎదురు చూపులకు తగ్గట్టుగా ఆర్ఆర్ఆర్ టీమ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించింది.
రోర్ ఆఫ్ ఆర్‌ఆర్‌ఆర్ పేరుతో మేకింగ్ వీడియో గ్లింప్స్‌ని జులై 15న ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మరి ఈ వీడియోలో.. ఈ సినిమాలోని నటీనటుల వర్కింగ్ విజువల్స్ చూపిస్తారా.? లోకేషన్స్ ను చూపిస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. ఆలియా భట్, ఒలివియా మోరిస్ నాయికలు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సంచలన చిత్రాన్ని అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Must Read ;- ఆర్ఆర్ఆర్ కలిసి ఓటీటీ ప్లాన్ చేయడం నిజమేనా..?











