పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తొలి ప్రయత్నంలోనే సక్సస్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆతర్వాత తెరకెక్కించిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించడంతో అనిల్ రావిపూడికి డిమాండ్ బాగా పెరిగింది. ఆయనతో సినిమా చేయడానికి సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు, యంగ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎనర్జిటిక్ హీరో రామ్ రెడ్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ రెడ్ కి కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. రామ్ తో అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ మూవీ చేయాలి అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. అప్పుడు రవితేజతో సెట్ అయ్యింది. ఇప్పుడు రామ్ అనిల్ రావిపూడితో సినిమా చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. వచ్చే సంవత్సరం చివరికి రామ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లచ్చు అంటున్నారు. మరి.. ఈసారైనా రామ్ తో సెట్ అవుతుందో లేదో చూడాలి.
Must Read ;- క్రాక్’ సినిమా వెంకీ చేయాల్సిందట!











