బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ లో ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉండడంతో మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచిందని చెప్పచ్చు. అవుట్ అండ్ అవుట్ కామెడీ పై నడిచే సినిమా కావడంతో పండగకి కరెక్ట్ సినిమా అని.. అల్లుడు అదుర్స్ టైటిల్ కి తగ్గట్టుగానే అదుర్స్ అనిపిస్తుందని ఈ మూవీ టీమ్ చెబుతున్నారు.
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సాయం చేసారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా నుంచి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అపజయం అనేది లేకుండా వరుస విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ – వరుణ్ లతో ఎఫ్ 3 సినిమా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా అనిల్ ఎంటర్ టైన్మెంట్ ని బాగా డీల్ చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు.
అందుకే అనిల్ ని అల్లుడు అదుర్స్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సలహాలు అడగగా.. సినిమా చూసి కొన్ని సలహాలు ఇచ్చాడట. అనిల్ సలహాలు ప్రకారం కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసారని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. సినిమా సక్సస్ పై మరింత నమ్మకం ఏర్పడింది. మరి.. సంక్రాంతికి రానున్న అల్లుడు అదుర్స్ అనిపిస్తాడో లేదో చూడాలి.
Also Read ;- ‘రెడ్’ వెర్సెస్ ‘అల్లుడు’.. పెద్దల సమక్షంలో పంచాయితీ