Ramappa Temple :
తెలంగాణలోని ప్రముఖ ఆలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కించుకునుంది. ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన అద్భుత కళారూపం ఇది. అపురూప శిల్ప సంపదకు ప్రసిద్ధి. కన్ను ఆర్పకుండా చేసే శిల్పాలు, అరుదైన లేత ఎరుపు రాతి నిర్మాణం, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం లాంటి ఎన్నో ప్రత్యేకతలు రామప్ప సొంతం. ఈ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. నల్లని రాతితో చెక్కబడిన ఈ నంది విగ్రహం సందర్శకులను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. నంది ముందు నించి ఏ దిశ వైపు చూసినా అది మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. తొలిసారి రామప్ప ఆలయ చిత్రాలు యునెస్కో అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించినట్లు స్పష్టమవుతోంది.
త్వరలోనే గుర్తింపు
రామప్ప పరిరక్షణకు ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రామప్పకు(Ramappa Temple) త్వరలోనే యునెస్కో గుర్తింపు లభించనున్నట్లు తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు చివరి దశకు చేరిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పరిరక్షణతోనే యునెస్కో గుర్తింపు దక్కనుందన్నారు. ఈనెల 25న జరగనున్న సమావేశంలో ప్రపంచ వారసత్వ కమిటీ సభ్యుల అనుమతి పొందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Must Read ;- బాబును తెలంగాణ మరువలేదు!.. ఇదిగో నిదర్శనం!