మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో విజయం సాధించిన ‘లూసీఫర్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మెహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎన్.వి. ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ రీమేక్ చిరంజీవి చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఇందులోని ఉన్న సిస్టర్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ముందుగా .. సీనియర్ హీరోయిన్ సుహాసిని, ప్రియమణి పేర్లు వినిపించాయి.
ఆ తర్వాత ‘లూసీఫర్’ లో నటించిన మంజు వారియర్ పేరు వినిపించింది. అయితే.. ఆఖరికి చిరంజీవి చెల్లెలుగా అందాల తార నయనతారను ఎంపిక చేసినట్టు సమాచారం. నయనతార చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించింది. ఈ పాన్ ఇండియా మూవీలో చిరు – నయన్ భార్యాభర్తలుగా నటించారు. ఇప్పుడు లూసీఫర్ రీమేక్ లో అన్నా – చెల్లెలుగా నటిస్తుండడం విశేషం.
ఇందులో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని మార్చి నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో హనుమాన్ జంక్షన్ అనే సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నారు. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన మోహన్ రాజా ఇక నుంచి టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తారేమో చూడాలి.
Must Read ;- మెగాస్టార్ ఆచార్యకు ‘సిద్ధ’మైన రామ్ చరణ్