మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ తిరుపతి లోక్‌సభ స్థానం బీజేపీ తరఫున పోటీచేయడం దాదాపుగా ఫైనల్ అయ్యింది. బీజేపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఆమె ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో రేపు హైదరాబాద్ లో భేటీ కానున్నారు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన, ఇరు పార్టీల నాయకులతో సమావేశం, ఉప ఎన్నిక ప్రచారం, ఇతర అంశాలపై చర్చించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదట్నుంచీ బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. తిరుపతిలో కూడా బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించింది. తిరుపతిలో రత్నప్రభను గెలిపించి, ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది.
Must Read ;- పవన్‌కి టీడీపీలో గౌరవం.. బీజేపీలో పరాభవం











