మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆ రెండు పాటలను చిత్రీకరించనున్నారు. క్రిస్మస్ కి లేదా సంక్రాంతికి ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఆచార్య ఇంకా పూర్తి కాకపోయినా చిరంజీవి ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. లూసీఫర్ రీమేక్ గా రూపొందుతోన్న గాడ్ ఫాదర్ మూవీ ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమా కంప్లీట్ కాకుండా చిరంజీవి భోళా శంకర్ అనే మూవీ కూడా చేస్తున్నారు. ఆమధ్య చిరు బర్త్ డే సందర్భంగా భోళా శంకర్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గాడ్ ఫాదర్ కంప్లీట్ అయిన తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రేజీ మూవీలో చిరు సిస్టర్ గా మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే.. చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది కన్ ఫర్మ్ కాలేదు. అందుకనే ఇంకా అనౌన్స్ చేయలేదు.
తాజా వార్త ఏంటంటే.. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నాను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమేనా కాదా అని ఆరా తీస్తే.. నిజమే అంటున్నారు. గతంలో చిరు, తమన్నా కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు మరోసారి చిరు, తమన్నా కలిసి జతకడుతుండడం విశేషం. త్వరలోనే తమన్నా ఈ సినిమాలో నటించే విషయమై అఫిషియల్ గా ప్రకటించనున్నారని సమాచారం. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Must Read ;- చిరు గాడ్ ఫాదర్ ఆగిందా.? మళ్లీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు?











