నందమూరి నటసింహం బాలకృష్ణ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. ఈ సినిమాని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దసరాకి ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయాలనుకున్న అక్టోబర్ 13నే అఖండ సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. గోపీచంద్ మలినేని క్రాక్ తరహాలోనే ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దసరాకి ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని తెలిసింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం తాజాగా రౌడీయిజం అనే పవర్ ఫుల్ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం త్రిష – ఇలియానాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే.. కథానాయిక ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే హీరోయిన్ ఎవరు అనేది కన్ ఫర్మ్ చేయనున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని సమాచారం.
Must Read ;- చిరంజీవి, బాలయ్య.. త్రిష ఎవరికి ఓకే చెప్పనుంది..?











