Revanth Reddy Given Call To Defeat BJP And TRS :
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నేడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మే తెలంగాణ ప్రజల తల్లి అని, ప్రతి ఇంట్లో ఆమె ఫోటో ఉంచాల్సిన అవసరం అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో పేదోళ్లు బతకలేని పరిస్థితులు ఉన్నాయని, పెట్రోలు ధరలు పెంచినందుకు, కరోనాను కంట్రోలు చేయలేక పోయినందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని గోతిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్త రెండేళ్లు కృషి చేసి తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్నారు.ఇక నుంచి వ్యక్తిగతంగా ఎవరికి జేజేలు కొట్ట వద్దని, ఇకనుంచి ఏ సందర్భంలోనైనా జై సోనియమ్మ, జై కాంగ్రెస్‌కు అని నినదించాలన్నారు. పాదరసం లాంటి కార్మకర్తలే కాంగ్రెస్ కు వ్యాహకర్తలని, ఏకే 47 లని రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి కేసీఆర్ ఫాంహౌస్‌లో బందీ
తెలంగాణ తల్లి కేసీఆర్ ఫాంహౌస్‌లో బందీ అయ్యిందని, రావణాసురుని చెర నుంచి సీతమ్మను వానర సైన్యం విడిపించినట్లు తెలంగాణ తల్లిని విడిపించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఒక గ్లాసు మంచినీళ్లు ఇస్తేనే కలకాలం చల్లంగా ఉండాలని ఆశీర్వదించడం తెలంగాణ ప్రజల సంప్రదాయమన్నారు. అలాంటిది 60 ఏళ్ల కలను సాకారం చేసిన సోనియమ్మకు మద్దతు పలికి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. పెద్దమ్మ, పోచమ్మ, జోగులాంబ, సోనియమ్మతల్లులతో పాటు వరుణ దేముడు కూడ ఆశ్వీరదించారన్నారు.
టీఆర్ఎస్‌ను ఓడించేది కాంగ్రెసే: మాణిక్యం ఠాగూర్
అంతకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను ఓడించేది కాంగ్రెస్ అని, 27 నెలలు కాంగ్రెస్ వారందరూ కలిసి కట్టుగా పనిచేసి అధికారంలోకి తేవాలన్నారు. అందరికీ సమాన అవకాశాల కోసం కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు. కలిసి పనిచేసి, 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
Must Read ;- రేవంత్ ప్రమాణం.. కోమటిరెడ్డి డుమ్మా