టీఆర్ఎస్‌ను వీడి ఇటీవల బీజేపీ చేరిన ఈటల రాజేందర్‌ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. ఆయన్ను ఏదో రకంగా జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారని, ఈటల వెనుక ప్రధాని మోదీ ఉన్నారంటూ పేర్కొన్నారు. ఈటలను వేధిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. ఆరేళ్లుగా ఈటల అధ్యక్షుడిగా ఉన్న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ సోదాలు చేయటంతో మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ..
ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్ ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. ఈటల ఉన్న కాలంలో అక్రమాలు జరిగాయంటూ తమకు ఫిర్యాదులు అందటంతోనే సోదాలు చేస్తున్నామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా సొస్తేటీ రికార్డులు కూడ స్వాధీనం చేసుకున్నారు. అయితే, భూ కబ్జా ఆరోపణలేమి రుజువు కాకపోవడంతో ఈటలను ఏదో రకంగా ఇరికించేందుకే ఏసీబీ సోదాలని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈటలను ఏసీబీ కేసులో ఇరికిస్తారన్న అనుమానంతోనే కిషన్‌రెడ్డి ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.
‘రెచ్చగొట్టడం కేసీఆర్‌కు అలవాటే’..
ఎన్నికలు జరిగినప్పుడు సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టడం కేసీఆర్‌కు అలవాటేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు.హుజురాబాద్ ఉఫ ఎన్నికలు జరగనున్నందునే తెలంగాణ, ఏపీల మధ్య జలవివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఎన్నికలైన తర్వాత ఇవన్నీ మర్చిపోతారన్నారు. ఆస్తులు పంచుకోవడంతో పాటు ఆతిథ్యాలు ఇచ్చి పుచ్చుకున్న కేసీఆర్, జగన్‌లు సమావేశమై జలవివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో కానీ ఏపీ ప్రజలను రాక్షసులుగా, ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని కిషన్‌రెడ్డి హితవు పలికారు. హుజూరాబాద్‌లో ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్న కేంద్ర మంత్రి కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని అన్నారు.
Must Read ;- కేసీఆర్, జగన్ కు రాజకీయాలే ముఖ్యం : జలవివాదంపై ‘బండి’ లేఖ!