KTR Announces Cambridge Company Investment In Genome Valley :
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. 24 గంటల విద్యుత్ సౌకర్యం, ఇతర రాష్ట్రాలకు సులువైన రవాణా మార్గాలు.. పెద్ద, పెద్ద కంపెనీల ఏర్పాటుకు అనువైన భూములు ఉండటంతో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టాన్నికూడా అమలు చేస్తుండటం కూడా మరో ప్రధాన కారణం. ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, ప్లాస్టిక్, ఇంజినీరింగ్, వ్యవసాయ ఆధారిత, గ్రానైట్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులు జరిగాయి.
మంత్రి కేటీఆర్ చొరవతో..
తెలంగాణలో ఇప్పటికే ఎన్నో విదేశీ సంస్థల పెట్టుబడులున్నాయి. ముఖ్యంగా ఐటీ మంత్రి కేటీఆర్ చురుగ్గా వ్యవహరిస్తూ విదేశీ సంస్థలను ఆకర్షించేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎలాంటి ప్రయోజనాలుంటాయి? విదేశీ కంపెనీలకు ఎలాంటి లాభాలు అందుతాయి? అనే విషయాలను వివరిస్తూ పెట్టుబడులను రాబట్టడంతో సక్సెస్ అవుతున్నారు. కంపెనీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా మరో విదేశీ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది.
కెనడా పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రంలో కెనడాకు చెందిన ఇవన్హో కేంబ్రిడ్జి అనే సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్, కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.747 కోట్లు) జీనోమ్ వ్యాలీలో (Genome Valley) ఎంఎన్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. లైఫ్ సైన్సెస్ దేశంలో లైఫ్ సైన్సెస్ రంగానికి బెంచ్ మార్క్ గా నిలుస్తుందని, ఈ తరహా పెట్టుబడులు రియల్ ఎస్టేట్ రంగంలోనే దక్షిణాసియాలోనే మొదటిది అని పేర్కొన్నారు. ఇలాంటి పెట్టబడులతో హైదరాబాద్ మరింత డెవలప్ మెంట్ అవుతుందని తెలిపారు.
Must Read ;- ముడసర్లోవ..ఆ పక్కనే గోల్ఫ్ క్లబ్.. కథేంటి విజయసాయిరెడ్డి?