ఆర్జీవీ ఏది చేసినా, ఏది తీసినా వివాదాలే. శుభమా అంటూ సుమంత్ పెళ్లి చేసుకోబోతుంటే మధ్యలో కారం జల్లే ప్రయత్నం చేశాడు. పెళ్లి మీద వర్మకు ఓ అభిప్రాయం ఉండి ఉండవచ్చు. సోలో బ్రతుకే సో బెటర్ అని ఆయన అనుకుని ఉండొచ్చు. తోడు కావాలని కోరుకుంటున్న సుమంత్ ను మాటలతోనే అడ్డుకోవడం ఎంతవరకు సబబు? ఆయన సినిమాలు, ఆయన వ్యక్తిగత జీవితం ఆయనిష్టం. దాన్ని ఇతరులపై రుద్దడం సమంజసమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భర్యాలు అనే పదం మీదే ఆయన కోపమంతా.
‘రకరకాల భార్యలు’ అంటూ ఓ వెబ్ సిరీస్ ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఈ సిరీస్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘రకారకాల భర్తలు’ అంటూ దీనిక సీక్వెల్ కూడా తీస్తున్నాడట. ఏడుపుగొట్టు మొహం, తగువుల మారి, అనుమాన పిశాచి, ఫోన్ పట్టుకుంటే వదలని రకం, ముక్కుమీద కోపం, భర్తను తొక్కేసే రకం, పిసినిగొట్టు, బడాయి భార్య.. ఇలా రకరకాల భార్యలు ఉంటారంటున్నారాయన.
ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకం భార్య గురించి చూపిస్తాడట. దీని ప్రోమోను కూడా జనం మీదికి వదిలారు. అంతవరకూ బాగానే ఉందిగానీ ఓ భార్యను సంపాదించుకోవాలని ఉబలాట పడుతున్న సుమంత్ మీద పడ్డారు. పెళ్లి చేసుకోబోయే ముందు మీరే డిసైడ్ చేసుకోండి అని హెచ్చరించే వర్మ సుమంత్ పెళ్లికి అడ్డు పుల్లలు వేస్తున్నాడు. సుమంత్ పెళ్లి విషయంలో వర్మ చేసిన కామెంట్ బయటివారికే ఇబ్బంది కలిగించేలా ఉంటే సుమంత్ కు ఇంకెలా ఉంటుందో.
‘ఒక్కసారి అయ్యాకా కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్.. నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ.. అనుభవించండి’ అంటూ వర్మ కామెంట్ చేశాడు. ఆ ట్వీట్‌కు ఓ ఏమోజీని కూడా వర్మ జత చేశాడు. అంతటితో ఆగలేదు.. ‘ఒక పెళ్లే నూరేళ్ల పెంట అయితే రెండో పెళ్లి ఏంటాయ్యా స్వామీ.. నా మాట విని మానెయ్యి పవిత్ర గారూ. మీ జీవితాలను పాడుచేసుకోకండి. తప్పు మీది కాదు.. తప్పు ఆ దౌర్భాగ్యపు వ్యవస్థది’ అంటూ మరో ట్విటీ్ చేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా అన్నది సమంత్ తేల్చుకోవాలి.
Must Read ;- హాట్ బ్యూటీ తొడల్ని ముద్దు పెట్టుకున్న వర్మ











