ప్రముఖ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల ముద్దుల కూతురు వనితా విజయ్ కుమార్ నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగులో దేవి సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది. తన ప్రతిభతో చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే… ఆశించిన స్ధాయిలో అవకాశాలు రాలేదనే చెప్పచ్చు. ఆమె నటించిన సినిమాలతో కన్నా.. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం విడాకులు తీసుకోవడం ద్వారానే ఎక్కువుగా వార్తల్లో నిలిచేది. ఈమధ్య కాలంలో వ్యక్తిగత కారణాలతో నటనకు చాలా కాలం దూరంగా ఉన్న ఈమె.. తమిళ్ లో బిగ్ బాస్ ద్వారా మళ్లీ తెర మీదకు వచ్చారు.
ఆ తర్వాత తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణతో వనితా విజయ్ కుమార్ కి గొడవ జరిగిందని.. వార్తలు వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా బిగ్‌బాస్ జోడిగల్ రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమె.. ఆ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కాస్టింగ్ కౌచ్, వేధింపులు, అవమానాలు అంటూ ట్వీట్లు చేసిన వనితా.. ఓ సీనియర్ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే.. ఆ షోకి హోస్ట్ వ్యవహరిస్తోంది సీనియర్ నటి రమ్యకృష్ణ. పైగా ఈ షో మొత్తంలో ఆమె సీనియర్ కూడా. దీంతో ఆమెను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని.. రమ్యకృష్ణ, వనితా విజయ్ కుమార్ మధ్య గొడవ జరిగిందని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి.
అయితే… ప్రచారంలో ఉన్న ఈ వివాదం గురించి ఓ కోలీవుడ్ న్యూస్ ఛానెల్ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించింది. దానికి రమ్యకృష్ణ స్పందిస్తూ.. షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది. నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. నో కామెంట్స్ అని తేల్చేసింది. వనితా విజయ్ పాల్గొన్న చివరి ఎపిసోడ్‌లో వనిత పర్‌ఫార్మెన్స్‌కు రమ్యకృష్ణ 10కి 1 మార్క్ ఇచ్చింది. అదీ.. సంగతి.
Must Read ;- క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ వదులుకోవాలా?











