TDP Leader PR Mohan Passed Away :
టీడీపీ సీనియర్ నాయకుడు, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ గుండెపోటుతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. టీడీపీ హయాంలో శాప్ చైర్మన్‌గా పనిచేసిన ఈయన టీడీపీలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
పార్టీకి ఎనలేని సేవలు
మోహన్ మృతి పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. టీడీపీ పాదయాత్ర విజయవంతం కావడం వెనక మోహన్ కృషి ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని, టీడీపీ నిబద్ధత గల నాయకుడ్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. మోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు.

ఎన్టీఆర్ కు వీరాభిమాని
పీఆర్ మోహన్ కు చిన్నప్పట్నుంచే ఎన్టీఆర్ చెప్పలేని ఇష్టం. ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ.. ఆయనపై ఇష్టం పెంచుకున్నారు. మొదట్లో న్యాయవాదిగా పనిచేసిన పీఆర్, ఎన్టీఆర్ పై ఇష్టంతో 1983లో టీడీపీలో చేరారు. పార్టీలో చురుకైన పాత్ర పోషించి, ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నారు. దీంతో ఎన్టీఆర్ సూచన మేరకు 1984లో శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1994, 2014లో రెండుసార్లు శాప్ చైర్మన్ గా పనిచేసి తనదైన ముద్ర వేశారు.
Must Read ;- బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూత
తెలుగుదేశం సీనియర్ నేత, శాప్ మాజీ ఛైర్మెన్ పి.ఆర్ మోహన్ గారి
మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. అంకితభావం, నిబద్దతలతో పార్టీకి సేవలందించిన మోహన్ గారి మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/lbaGEm0yvp— N Chandrababu Naidu (@ncbn) July 12, 2021











