కరోనా రావడంతో థియేటర్లు మూతపడడం.. ఓటీటీలకు టైమ్ రావడం తెలిసిందే. టాలీవుడ్ లో ఓటీటీలకు అంత త్వరగా టైమ్ వస్తుంది అనుకోలేదు. కాకపోతే కరోనా కారణంగా చాలా ఫాస్ట్ గా ఓటీటీలు దూసుకెళుతున్నాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. మై హోమ్ గ్రూప్ రామ్ తో కలిసి ఆహా ఓటీటీకి శ్రీకారం చుట్టడడం… ఇది అనతి కాలంలోనే సక్సస్ ఫుల్ గా రన్ అవుతుండడం తెలిసిందే. ఆహా సక్సస్ కావడం.. రానున్న కాలం అంతా డిజిటల్ మీడియాదే కావడంతో స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ ఓటీటీ వైపు చూస్తున్నారు.
ఇటీవల యువ పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు కూడా నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ అంటూ స్పార్క్ అనే సరికొత్త ఓటీటీని లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ.. ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈటీవీ అధినేత రామోజీరావు కూడా ఓటీటీ రంగంలో ఎంటర్ అవుతున్నాడు. ఇప్పటికే ఓటీటీ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజా వార్త ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ అంటే.. రామారావు, రామ్ చరణ్ , రాజమౌళి ఈ ముగ్గురు కలిసి ఓటీటీ స్టార్ట్ చేయనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నిజంగానే ఈ ముగ్గురు కలిసి ఓటీటీ ప్లాన్ చేస్తున్నారా..? లేక ఇది గ్యాసిప్పా..? అనేది ఆసక్తిగా మారింది. ఈ ముగ్గురు కలిసి ఓటీటీ స్టార్ట్ చేస్తున్నారా..? లేదా..? అనేది పక్కన పెడితే.. టాలీవుడ్ లో రానున్న కాలంలో మరిన్ని ఓటీటీలు రానున్నాయనేది మాత్రం కన్ ఫర్మ్. మరి.. ఆర్ఆర్ఆ్ ఓటీటీ పై జక్కన్న క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- అక్టోబరు వరకూ ఓటీటీకీ నో: తెలంగాణ ఫిలిం ఛాంబర్











