‘చిత్రలహరి, ప్రతి రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్’ మూవీస్ తో వరుసగా హిట్స్ అందుకొని హ్యాట్రిక్ సాధించాడు మెగా మేనల్లుడు సాయితేజ. ఈ ఏడాది ఓ సరికొత్త కథాంశంతో బరిలోకి దిగుతున్నాడు. సినిమా పేరు రిపబ్లిక్. దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. అవినీతి రాజకీయాల్ని ఎండగట్టబోతోంది. ప్రస్తుతం మన వ్యవస్థ, వ్యక్తులు ఎంతగా కరెప్ట్ అయ్యాయో ఈ సినిమా ద్వారా తెలియజేయబోతున్నాడు దర్శకుడు. ఇందులో నెగెటివ్ షేడ్స్ తో ఉన్న పొలిటికల్ లీడర్ గా రమ్యకృష్ణ నటిస్తోంది. ఆమె పేరు విశాఖవాణి. జూన్ 4న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో రిపబ్లిక్ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో, అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండానే ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకున్నాం. ప్రజలే కాదు సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసలు గానే బతుకుతున్నారు’.. అంటూ ఉద్వేగంతో సాయితేజ చెప్పే డైలాగ్ మీద.. ఆసక్తికరమైన విజువల్స్ తో టీజర్ ను కట్ చేశారు. అందులో రమ్యకృష్ణ డాబు, దర్పం ఆకట్టుకుంటాయి. ఇక చివరిలో ‘వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే సార్ …’. అంటూ పలికే సాయితేజ డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. ఇందులో విజువల్స్ చూస్తుంటే.. ‘దేవకట్టా’ ప్రస్థానం సినిమా గుర్తుకువస్తోంది. ఆ సినిమా తర్వాత సరైన హిట్ అందుకోలేకపోయిన దేవాకట్టా రిపబ్లిక్ తోనైనా మంచి సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
Must Read ;- తమిళ హిట్ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ సినిమా