తమిళ దళపతి విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ మూవీ ‘మాస్టర్’. ఈ సినిమా తమిళనాట సూపర్ సక్సెస్ సాధించింది. తెలుగులో మాత్రం పర్వాలేదనిపించుకుంది. జువైనల్ హోమ్ లో జరగుతున్న అక్రమాలకు చెక్ పెట్టే మాస్టర్ గా విజయ్ అదరగొట్టగా.. విలన్ గా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఎందరో బాలీవుడ్ మేకర్స్ కన్నేశారు.
అయితే ఈ సినిమాను చూసిన సల్మాన్ ఖాన్ కు ఆ సినిమా కథాంశం బాగా నచ్చడంతో ఈ సినిమా రీమేక్ చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుండగా.. ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇతర కేస్టింగ్ , దర్శకుడు వివరాలు తెలియనున్నాయని బాలీవుడ్ మీడియా తెలిపింది. ఆల్రెడీ లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమా కూడా బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఇప్పుడు అతడి మరో సినిమా కూడా రీమేక్ కానుండడం విశేషంగా మారింది. మరి మాస్టర్ గా సల్లూభాయ్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.
Must Read ;- వంశీ పైడిపల్లితో దళపతి విజయ్ తెలుగు సినిమానా?