(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
గజపతుల రాజకుటుంబంలో యువరాణుల మధ్య పోరు మలిదశకు చేరుకుంటోంది. ఆనంద గజపతి వారసత్వం ఎవరిదనే విషయం ఇప్పుడు కోర్టు గడప తొక్కనుంది.
సంచైత తల్లి ఉమా గజపతి న్యాయపరంగా ఆనందగజపతి నుండి విడాకులు తీసుకున్న తరువాత సంచైత గజపతికి వారసత్వపు హక్కులు లభిస్తాయా? స్వయానా న్యాయవాది అయిన సంచైతకు ఈ విషయం తెలియదా? అనే చర్య పలువురిలో జరుగుతోంది. ఏ ఉద్దేశంతో సంచైత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? వారసత్వపు హక్కులు తనకే ఉన్నాయని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని, న్యాయస్థానంలో తేల్చుకుంటామని ఊర్మిళ అంటుండటంలో ఆంతర్యమేంటి? ఇలాంటి చర్చ ఇప్పుడు విజయనగరం వాసుల్లో జరుగుతోంది. మరోవైపు- (ఇదీ చదవండి : రాజుల వైభవం బజార్న పడింది)
మాన్సాస్ బైలా ప్రకారం ఛైర్మన్‌గా పూసపాటి వంశానికి చెందిన పురుషులకే మాన్సాస్ ఛైర్మన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంటుందని, ఈ విషయంపై కోర్టులో కేసు దాఖలు చేశానని, న్యాయం తనవైపే ఉంటుందంటున్న అశోక్ గజపతి రాజు వాదన ఎంతవరకు సమంజసం?
ఈ ప్రశ్నలు ప్రస్తుతం విజయనగరం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన తల్లి సుధా గజపతి తో కలిసి ఊర్మిళ గురువారం మీడియా ముందు తన భావాలను నిక్కచ్చిగా వెల్లడించారు. దాంతో పాటు సంచైత వ్యవహారశైలి బాగోలేదని సుస్పష్టం చేశారు. సంచైత అంతా తానై వ్యవహరిస్తోందని, మాన్సాస్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నించినా అవకాశం కల్పించడం లేదని ఆరోపించారు. ‘మా హక్కులను ఎవరూ కాలరాయలేరు. అన్ని రకాల హక్కులు మాకు ఉన్నాయి. ఆధారాలు ఉన్నాయి.. అని ఆనందగజపతి రాజు కూతురు ఊర్మిళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి : యువరాణుల సిగపట్లు )
విడిచిపెట్టేది లేదు
న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అంటున్నారు ఊర్మిళ. సాంప్రదాయాలకు తిలోదకాలిస్తే చూస్తూ ఊరుకోమని, తండ్రి, తాత ఆశయాలు , ఆకాంక్షలకు ఎవరు అడ్డు తగిలినా సహించనని, వాటిని నెరవేర్చేందుకు తాను ఉన్నానని అన్నారు. సుధా గజపతి మాట్లాడుతూ పదవులు, అధికారాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. వాటిని చూసుకుని ఏ ఒక్కరూ ఎగిసి పడకూడదని, ఆచారాలకు, సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వకూడదని, కుటుంబ వ్యవహారాలను , అనుబంధాలను మంట గలుపుకోకూడదని అన్నారు. ఈ వ్యవహారం రాజకీయం చేయకూడదని అనుకుంటున్నామని, న్యాయపోరాటం ద్వారా తేల్చుకుంటామని చెప్పారు.
(ఇది చదవండి : సంచైత దుడుకుతనమే ముప్పఅయిందా?)
చిక్కులు తప్పవా?
ఇప్పటికే మాన్సాస్ సారథ్యానికి సంబంధించి ఒక కేసు కోర్టులో ఉంది. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన బైలాస్ అన్నీ స్పష్టంగానే ఉన్నాయి గనుక.. తాను నెగ్గక తప్పదని.. మాన్సాస్ పగ్గాలు మళ్లీ తన చేతికే వస్తాయని అశోక్ గజపతి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆనందగజపతి వారసత్వానికి సంబంధించి.. ఊర్మిళ కూడా కోర్టుకు వెళితే.. సంచైతకు చిక్కులు తప్పవేమో అనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది. కోట మీద కూర్చోవడం అనే చిన్న అంశాన్ని కెలికి రాద్ధాంతం చేసి.. సంచైత ఇంతదాకా తెచ్చుకున్నట్లు అయింందని పలువురు భావిస్తున్నారు.