సీరియల్స్ లో సంచలనం కార్తీక దీపం. ఈ సీరియల్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ శౌర్య మంచి పేరు సంపాదించుకుంది. పాత్రకు తగ్గట్టుగా నటించి.. ప్రేమి విశ్వనాధ్, నిరూపమ్ పరిటాల, వంటి సీనియర్ ఆర్టిస్టుల తోనే కాకుండా సామాన్య ప్రేక్షకులతో కూడా కంటతడి పెట్టిస్తుంది. ఈ చిన్నారి యాక్టింగ్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే.
బుల్లితెర మీదే కాకుండా.. సోషల్ మీడియా సైతం యాక్టీవ్ గానే ఉంటుంది. ఈ చిన్నారి ఫోటోలకు పోజులు ఇస్తుంది. ఆ ఫోటో లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. 5 ఏళ్ల వయసులోనే శౌర్య బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ శౌర్య బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే.. కార్తీక దీపం శౌర్య గా ఫేమస్ అయిన ఈ చిన్నారి పేరు గ్రంధి కృతిక. సీరియల్ లో మాత్రం శౌర్య గా మనందరికీ తెలుసు. ఆమె తండ్రి వంశీ కృష్ణ పెద్ద బిజినెస్ మేన్. శౌర్య గీతాంజలి సీరియల్ ద్వారా బుల్లితెర కు పరిచయమైంది.
హైటెక్ సిటీ లోని హనుమాన్ నగర్ లో వీరు నివాసం ఉంటున్నారు. దాదాపు నెలకి 10 రోజుల పాటు షూటింగ్ లతో బిజీ గా ఉంటే 15 రోజులు పాటు స్కూల్ కి వెళ్తుంది కృతిక. 2018 లో బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డు కూడా సంపాదించింది. 200 మంది అనాధ పిల్లలతో గత ఏడాది కృతిక పుట్టినరోజుని జరుపుకుంది. కృతిక ఇప్పటికే 15 సీరియల్ పైగా నటించింది. ప్రస్తుతం కృతిక బావా మరదలు, అక్క మొగుడు , కార్తీక దీపం లలో నటిస్తోంది.
అటు సీరియల్ లోనే కాకుండా..సినిమాల్లో కూడా నటిస్తోంది. బాలయ్య నటించిన జై సింహ, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. సినిమాల్లో కూడా అద్భుతంగా నటించింది అనే చెప్పాలి, ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వం వహించిన తధాస్తు అనే షార్ట్ ఫిలింలో కూడా ఆమె ఛాన్స్ దక్కించుకుంది. ఈ టీవీ లో ప్రసారం అయిన స్టార్ మహిళా షో లో పార్టిసిపేట్ చేసి సుమతో సరదాగా మాటలు ఆకట్టుకుంది.
ఐదేళ్ల వయసులోనూ జ్వరం వచ్చినా సరే ఆమె షూటింగ్ కి మాత్రమే వెళ్తాను అని చెప్పేది. ఓ పక్క విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పినా సరే.. షూటింగ్ లకు వెళ్లడం మానేది కాదు. శౌర్య కి నటన అంటే అంత ఇష్టం. సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ.. చదువులో వెనకబడింది అనుకుంటే పొరపాటే. క్లాస్ లో ఎప్పుడూ ఫస్టే వస్తుండడం విశేషం. ఇలా ఎడ్యుకేషన్ అండ్ యాక్టింగ్ ని బ్యాలెన్స్ చేస్తూ.. చిన్న వయసులోనే పేరు సంపాదించి ఫేమస్ అయిన శౌర్య భవిష్యత్తులో నటిగా మరింతగా రాణిస్తుందేమో చూడాలి.
Mjust Read ;- సీరియల్స్ లో, సోషల్ మీడియాలో దూసుకెళుతోన్న అందమైన అత్తగారు