విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండంలో పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని.. సర్పంచ్ అభ్యర్థిగా పోటిచేసిన రమేశ్ ఆరోపిస్తున్నారు. అతని ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టకపోవడంతో ఏకంగా కలెక్టరేటు ఎదుట 700 మంది మద్దతుదారులతో నిరసన చేపట్టారు.
విశాఖపట్నం రెవెన్యూ డివిజన్‌లోని 130 గ్రామపంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే గండిగండం పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని సర్పంచ్ అభ్యర్ధి రమేశ్ ఆరోపిస్తూ.. తన మద్దతుదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. మొదట రమేశ్ విజయం సాధించారని ప్రకటించి, మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించారని, అనంతరం ప్రత్యర్థి విజయం సాధించినట్లు ధ్రువీకరించారని రమేశ్ చెప్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి.. చర్యలు చేపట్టాలని కోరారు. మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Must Read ;- ఆగిన చోట నుంచే పురపాలికల ఎన్నికలు.. ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాల అసంతృప్తి