తెలుగు తేజం 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్య నాదెళ్లను ఆ సంస్థ ఛైర్మగా నియమించారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ ధాంస్సన్ స్థానంలో సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా నియమించారు. మైక్రోసాఫ్ట్ అభివృద్ధిలో సత్య నాదెళ్ల కీలకంగా పని చేశారు. ఆరేళ్లుగా మైక్రోసాఫ్ట్ సీఈవోగా సంస్థను అనేక సంక్షోభాల నుంచి అధిగమించేలా చేసిన సత్య నాదెళ్లను ఛైర్మన్ గా నియమించారు. ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా వెలుగొందుతూ 4 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్న సాఫ్ట్ వేర్ సంస్థకు ఓ తెలుగు వ్యక్తి ఛైర్మన్ కావడం చరిత్రలో ఇదే మొదటి సారి.
మనోడే..
అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల విద్యాభ్యాసం చాలా వరకు హైదరాబాద్‌లో కొనసాగింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన సత్య నాదెళ్ల 26 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. మొదటి నుంచి సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన సత్య నాదెళ్ల అంలంచెలుగా ఎదిగారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ఆరేళ్ల నుంచి విజయవంతంగా సంస్థను ముందుకు నడిపించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ అభివృద్ధిలో చురుగ్గా వ్యవహరించిన సత్య నాదెళ్ల ఆ సంస్థకు ఛైర్మన్ కావడం తెలుగువారికే కాదు…భారతీయులంతా గర్వించదగిన విషయం.
Must Read ;- అంజలి లాంటి దివ్య సుందరితో సుందర్ పిచాయ్ ప్రేమ











