ఏపీలో ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు. గురువారం తాడిపత్రిలో స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జెసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిలోకి వెళ్లి ఆయన అనుచరులను బయటకు లాక్కుని తీసుకొచ్చి దాడి చేయడం దీనికి పరాకాష్టగా చెబుతున్నారు. వారు విడుదల సీసీ కెమేరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలిస్తే అందులో పోలీసులు కూడ ఉన్నారు. అయితే వారు దాడులను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో పోలీసులు దాడులు చేస్తున్న వారికి అండగా వచ్చారా లేక బాధితులను రక్షించేందుకు వచ్చారా అనే అనుమానం కలుగక మానదు. ఇంతగా దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటం గమనార్హం. పార్టీ పెద్దల ప్రోత్సాహంతో పాటు స్థానిక పోలీసుల సహకారంతోనే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Must Read ;- వేడెక్కిన తాడిపత్రి : జేసీ ఇంటిపై కేతిరెడ్డి దాడి!