ఎస్ఈసీ నిమ్మగడ్డ పరిషత్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు చెప్పిన తర్వాతే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తానంటూ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల ఏకగ్రీవాల పిటిషన్ కోర్టులో రేపు విచారణకు రానున్న నేపథ్యంలో.. ఈసీ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రేపు కోర్టు తీసుకునే నిర్ణయంపైనే పరిషత్ ఎన్నికల నిర్వహణ ఆధారపడుంది. ఒకవేళ రేపు కోర్టు ఎలాంటి స్పష్టత ఇవ్వని పక్షంలో పరిషత్ ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వం ఇప్పటికే పరిషత్ ఎన్నికల నిర్వహించాలని కోరిన నేపథ్యంలో.. ఈసీ వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఈసీ కలెక్టర్లకు జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ వ్యాఖ్యలతో పరిషత్ ఎన్నికల నిర్వహణ డోలాయమానంలో పడింది.