పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్క్రూటినీలో ఆమోదం పొందిన అభ్యర్థులు తమను బలవంతంగా విత్ డ్రా చేయిస్తే ఆర్‍వోకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉత్తర్వుల్లో పేర్కొన్న ఎన్నికల కమిషన్ బలవంతపు ఫిర్యాదులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
Must Read ;- కక్షగట్టి జైలుకు పంపారు.. రిజల్ట్ తో షాక్ తిన్నారు!!