తన సినిమాలతో దక్షిణాదినే కాకుండా.. ఉత్తాదిన కూడా బాగా పాపులర్ అయిన శృంగార తార షకీలా. రెండు దశబ్ధాల పాటు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది షకీలా. స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ సొంతం చేసుకుని తన సినిమాలతో ప్రేక్షకాదరణ పొందింది. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఈ శృంగార తార గత కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేక దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. సంపాదించిన ఆస్థులు పోయాయి.. సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. దీంతో జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.
1994 నుంచి దాదాపు 20 సంవత్సరాల పాటు ఇండియన్ సినిమా పై హాట్ టాపిక్ గా నిలిచారు. ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే.. మలయాళంలో స్టార్ హీరోల సినిమాలు సైతం వాయిదా వేసేవారంటే.. షకీలాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న భారతీయ ఏకైక శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె క్రేజ్ సౌత్ లోనే అనుకుంటే పొరపాటు. నార్త్ లో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్. స్టార్ హీరోలకు సమానంగా షకీలా సినిమాల కలెక్సన్స్ వసూలు చేయడం విశేషం.
అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న షకీలా తాజాగా ఓ ఇంటర్ వ్యూలో కొన్ని సీక్రెట్స్ ను బయటపెట్టారు. ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే.. ప్రేమలో ఫెయిల్ అయ్యానని సీక్రెట్ బయటపెట్టింది. ఇప్పటి వరకు ఏడెనిమిది మందితో ప్రేమలో పడ్డానని.. అయితే.. వాళ్లు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదని.. స్వయంగా షకీలా తెలియచేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఈ విషయాలను బయటపెట్టింది.
ఇటీవల వచ్చిన బయోపిక్ గురించి స్పందిస్తూ.. అందులో అవాస్తవాలు ఎక్కువుగా ఉన్నాయి. అది నా బయోపిక్ అనిపించలేదు అన్నారు. సిల్క్ స్మిత బయోపిక్ థర్టీ పిక్చర్ లో నాకు, సిల్క్ స్మిత గారికి మధ్య పోటీ ఉందని చెప్పారు. అది చాలా తప్పు. నాకంటే ఆమె పెద్ద నటి. ఆమె నాకు ఆదర్శం. అయితే.. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఓసారి షూటింగ్ స్పాట్ లో సిల్క్ స్మిత నన్ను కొట్టింది. ఆ టైమ్ లో అక్కడున్న వాళ్లు నన్ను ఏదోలా చూశారు. ఆతర్వాత ఆమె సారీ చెప్పింది అంటూ తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టింది షకీలా.
Must Read ;- నాకు సిల్క్ స్మిత అంటే ఇష్టం ఉండదు