ఆరోగ్యం క్షీణించినా తాను తలపెట్టిన ప్రకారం షర్మిల 72 గంటల దీక్షను లోటస్ పాండ్‌లో కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలంటూ షర్మిల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పోలీసులు 24 గంటలే దీక్షకు అనుమతి ఇచ్చి నిన్న ఇందిరాపార్కు వద్ద దీక్షను భగ్నం చేసిన క్రమంలో ఆమె కాలినడకన లోటస్ పాండ్‌కు బయలుదేరగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద ఆమెను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఆమె చేతికి గాయమైంది. అయినా కూడ ఆమె లోటస్ పాండ్‌లో నేడు రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు.
దీక్షకు విజయమ్మ సంఘీభావం
తనను పోలీసులు గాయపరిచారని, మరోసారి చేయిపడితే ఊరుకోబోనని షర్మిల వార్నింగ్ ఇచ్చారు. షర్మిల దీక్షకు ఆమె తల్లి విజయమ్మ సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం షర్మిల పోరాటం కొనసాగుతుందని వైఎస్ విజయలక్ష్మి అన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని విజయలక్ష్మి అన్నారు.
ALSO READ:- సాక్షి కెమెరామెన్‌ను వెళ్లిపోమన్న షర్మిల.. వారించిన విజయమ్మ











