షర్మిల ప్రస్థానం తెలంగాణలో పకడ్బందీగా నడుస్తోంది. కావాల్సినంత ఆర్ధిక దన్ను ఉండటంతో.. పక్కా ప్లాన్, షెడ్యూల్, క్యాలెండర్ ప్రకారం కథ నడిపిస్తున్నారు. ఆమెను తెలంగాణ ప్రజలు ఒక నాయకురాలిగా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ప్రస్తుతానికి పక్కన పెడితే.. షర్మిల, భర్త అనిల్, వారి టీమ్ పెడుతున్న ఎఫర్ట్స్ మాత్రం మామూలుగా లేవు. ఏదైనా వ్యాపారంలోకి బిగ్ గేమర్ ఫుల్లు ఇన్వెస్ట్మెంట్‌తో రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో షర్మిల ఎంట్రీ.
ఏ జిల్లా వారితో ఆ కబుర్లు
ఏ జిల్లా వాళ్లు వస్తే ఆ జిల్లా కబుర్లు.. అక్కడి సమస్యలు.. ముఖ్యంగా తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ జిల్లా గురించి చేసిన ఆలోచనలు… ప్రతిపాదనలు అన్నీ ఏకరువు పెడుతోంది షర్మిల. కాకపోతే ఆమె చెప్పే విధానం మాత్రం ఫుల్లు ప్రిపేర్ అయి చెబుతున్నట్లు ఉంది కాని.. ఎమోషన్ కేరీ కావడం లేదు. అదొక్కటే లోపంగా కనపడుతోంది. అంటే కంటెంట్ వరకు సమస్య లేదు.. పక్కాగా ఉంటోంది. దీనికి కారణం ఆమె కోసం పని చేస్తున్న టీమ్.

టీమ్‌ను లీడ్ చేస్తున్న మాజీ జర్నలిస్టు
గతంలో జర్నలిస్టుగా ఉండి.. తర్వాత కేసీఆర్ దగ్గర టీమ్‌లోనూ.. ఇతర చోట్ల పని చేసిన వ్యక్తి ఈ టీమ్‌ను లీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవటానికి స్ట్రాటజిస్ట్ అయినప్పటికీ.. కంటెంట్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అందుకే వరంగల్, మెదక్, కరీంనగర్.. జిల్లా ఏదైనా సరే.. పక్కాగా స్క్రిప్ట్ రెడీ అవుతోంది. సామాజికవర్గాలు, సమీకరణాలు, నిర్లక్ష్యానికి గురైన నాయకులు.. లెజెండరీగా నిలిచిన లీడర్లు.. అందరి పేర్లు ప్రస్తావిస్తూ షర్మిల ప్రసంగం వచ్చినవారిని ఆకట్టుకుంటోంది. వాస్తవానికి ఈ ప్రసంగాలు వచ్చినవారి కోసం.. ఆ పేరుతో మీటింగ్ పెట్టి.. దానిని మీడియాలో సర్క్యులేట్ చేయడమే వారి ఉద్దేశం. ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు.
ఖమ్మం, హైదరాబాద్‌ల నుంచి టేకాప్
ఇక ఏప్రిల్ 9న బహిరంగసభ ఖమ్మంలో ప్లాన్ చేశారు. దీని కోసం ఫుల్లు ప్లానింగ్ నడుస్తోంది. ఆ తర్వాత సభ హైదరాబాద్‌లోనే. ఇక్కడే వారి తెలివి కనపడుతోంది. తెలంగాణ సెంటిమెంట్ తక్కువగా ఉండి.. ఆంధ్రా ఫ్లేవర్ ఎక్కువగా ఉండే జిల్లా ఖమ్మం. అలాగే హైదరాబాద్‌లో కూడా ఆంధ్రావాళ్లు అధికంగానే ఉంటారు. ఈ రెండు చోట్ల మొదట సభ ప్లాన్ చేయడం వెనక పెద్ద లెక్కే ఉంది. అంటే టేకాఫ్ పక్కాగా ఉండి సక్సెస్ అయితే.. హైప్ వచ్చేస్తుంది. ఆ ఎఫెక్ట్ ఇతర ప్రాంతాలపై పడుతుంది. అందుకే టేకాఫ్ కోసం ఖమ్మం, హైదరాబాద్‌లను సెలెక్ట్ చేసుకున్నారు.
ఇక త్వరలోనే ప్రశాంత్ కిషోర్ కన్సల్టెంట్ కంపెనీ ఎంట్రీ ఇవ్వబోతుందంట. ఆల్రెడీ నెగోషియేషన్స్ అయిపోయాయి.. ఇక అగ్రిమెంటే పెండింగ్. లోకల్ టాలెంట్‌తో ఇంత హంగామా చేస్తుంటే.. ఇక పీకే టీమ్ ఎంటరయ్యాక ఇంకెలా ఉంటుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Must Read ;- షర్మిల గూటికి ప్రజాకవి ఏపూరి సోమన్న











