ఆ ప్రశాంత్ కిషోర్ ఏమంటా అడుగు పెట్టాడో గాని.. ఏపీలో డ్రామా కంపెనీ డిస్కోలు 2019 ఎన్నికల్లో ఎన్ని ఆడారో, ఎలా గెలిచారో చూశాం. అవన్నీ చూడటం వల్లేనేమో.. ఇప్పుడు మనకు ముందే తెలిసిపోతుంది.. ఢ్రామా అని. తెలంగాణలో షర్మిల పార్టీ వ్యవహారం చూస్తుంటే కామెడీ సినిమాను మించిపోతున్న ఫీలింగ్ వస్తోంది.
హైప్ క్రియేట్ చేయడానికా..?
ఖమ్మంలో ఏప్రిల్ 9న మీటింగ్ పెట్టుకుంది షర్మిల. మరి ఎవరూ పట్టించుకోరు కదా.. అందుకే హైప్ క్రియేట్ చేయడానికి చిన్న డ్రామా ఆడారు. రాత్రికి రాత్రే వైఎస్ఆర్ విగ్రహం ఒకటి కూలగొట్టారు. ఎవరు కూలగొట్టారని మనం అడక్కూడదు. అది ఎప్పటికీ తేలదు. ఎవరో కూలగొట్టారని.. ఇది కేవలం షర్మిల సభ పెట్టడం ఇష్టం లేకేనని.. అలాంటివారిని సహించబోమని.. మా సభ విజయవంతం అవుతుందని వెంటనే ఓ చోటా నాయకుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడటం.. దానిని మీడియా బ్రేకింగులు వేయటం.. తెల్లారి హైదరాబాద్‌లో కూడా ఒక ధర్నా నిర్వహించేయటం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. అసలు మీటింగ్ డిస్ట్రబ్ చేయడానికి ఎవడైనా వైఎస్ఆర్ విగ్రహం పడగొడతారా.. విగ్రహం పడేస్తే ఎవరికి పబ్లిసిటీ వస్తుందో వేరే చెప్పనక్కర్లేదుగా. దాని కోసం ఎవరు చేస్తారో.. ఎవరు చేయిస్తారో అర్ధమవుతూనే ఉందిగా.
అంతకు ముందు ఓ స్టూడెంట్..
అంతకు ముందు ఓ స్టూడెంట్ (ఆ పేరుతోనే వచ్చాడులే) అక్కా నువ్వు ఉండాలక్కా.. మా కోసం ఉండాలక్కా అంటూ గావుకేకలు పెడుతూ.. (అచ్చు అదేవో సభల్లో చేసినట్లు) హడావుడి చేశాడు. వెంటనే షర్మిలక్క ఎమోషన్‌తో వాడిని ఓదార్చింది. ఆ తర్వాత నేనున్నా.. నేనున్నా అంటూ చాలా డ్రమెటిక్‌గా మాట్లాడింది. ఈ ఎపిసోడ్‌ను మీడియా బాగా హడావుడి చేసింది. ఎందుకంటే ఎవరి కవర్ వాళ్లకు వెళ్లిపోతూనే ఉంది. తీరా తర్వాత సోషల్ మీడియాలో ఆ స్టూడెంట్ కాని స్టూడెంట్ ఎవరో బయటపెట్టారు. కల్వరి టెంపుల్‌లో ఆర్కెస్ట్రాలో పని చేసేవాడని.. ఆల్రెడీ వాళ్ల బ్యాచ్ లోనివాడేనని.. అతని తండ్రి ఎప్పుడో వైఎస్ కంటే ముందే చనిపోయాడని నెటిజన్లు వాయించేశారు. ఇవన్నీ రేవంత్‌రెడ్డి సైతం ఓ చానెల్‌లో చూపించారు.
Must Read ;- షర్మిల వెంటే వైఎస్ ఫ్యామిలీ.. జగన్ ఏకాకేనా?
మరో డ్రామా ఏంటంటే..
మరో డ్రామా ఏంటంటే…రోజూ ఏదో ఒక సెలెబ్రిటీ వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటిస్తారు. అంటే ఎవరికివాళ్లకి డేట్లు ముందే ఇస్తారు. అందరూ ఒకే రోజు వచ్చేస్తే పబ్లిసటీ ఆ ఒక్కరోజే కదా.. అందుకని.. రోజుకొకరు చొప్పున వస్తున్నారు. ఒకరోజు యాంకర్ శ్యామల.. మరోరోజు ఆర్టిస్ట్ ప్రియ.. అలా రోజుకొకరు వచ్చి.. షర్మిలక్కకు మద్దతు ప్రకటించి పోతున్నారు. ఇది కూడా హైప్ క్రియేట్ చేసే ట్రిక్ తప్ప మరోటి కాదు.
గతంలో జగన్‌కు కూడా మద్దతు ప్రకటించినవారే..
చివరగా షర్మిలక్క దగ్గరకు వచ్చిపోయే వాళ్లను చూస్తుంటే.. గతంలో జగన్‌కు కూడా మద్దతు ప్రకటించినవారే ఎక్కువమంది కనపడుతున్నారు. అంటే జగన్ పర్మిషన్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా.. అంటే నమ్మబుద్ధి కావటం లేదు. పైగా తన సామ్రాజ్యంలో ఇలా ఒక ఆంధ్రా పార్టీ అడుగుపెట్టడాన్ని చూసీ చూడకుండా కేసీఆర్ వదిలేస్తున్నారంటే కూడా అస్సలు నమ్మలేకపోతున్నాం. మరి వీరిద్దరి ఆశీస్సులతోనే చెల్లెమ్మ ఎంటరైందా అంటే ఏమో చెప్పలేం.











