నందమూరి తారకరాముని చివరి రోజుల్లో భార్యగా ఉన్న లక్ష్మీ పార్వతి ఇప్పుడు తెలుగు అకాడమీ ఛైర్మన్. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలొో ఉంటూ.. రాజకీయ దన్ను అందించే పదవుల హోదాలను అనుభవిస్తున్నారు. అంతవరకు ఎవరికీ ఎలాంటి అభిప్రాయం లేదు. అయితే ఆమె ఎన్టీఆర్ గురించి చెప్పిన ఒక మాట ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా.. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద.. సోమవారం నివాళులు అర్పించిన లక్ష్మీ పార్వతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో ఉండే యావత్ తెలుగు జాతికి ఆయన ఎప్పటికీ గుర్తుంటారని అన్నారు. పనిలో పనిగా.. తనకు ఇవాళ ఈ హోదాను కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డిని కూడా ఆకాశానికెత్తేశారు.
ఎన్టీఆర్ లాగానే.. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో రామరాజ్యం పాలన అందిస్తున్నారని అన్నారు. విగ్రహాల ధ్వంసంపై రాజకీయం చేస్తున్నారని.. రాష్ట్రానికి జగన్ పాలనే శ్రీరామరక్ష అని లక్ష్మీ పార్వతి అన్నారు.
ఇదే సందర్భంలో మాట్లాడుతూ..
తమ ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడని లక్ష్మీపార్వతి అన్నారు. బహుశా ఆమెకు మనవడు పుట్టాడేమోనని, మనవడి గురించి ఆమె అలా చెప్పి ఉండవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు. ఆయన ఆశయ స్పూర్తితో నా భర్త ఆశీస్సులు ఆ బిడ్డ పై ఉండాలి అని లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె కొడుక్కి కొడుకు పుడితే.. చిన్న ఎన్టీఆర్ పుట్టినట్లు ఎలా అనుకుంటారని ప్రజలు అనుకుంటున్నారు.
Must Read ;- జగన్ పెద్ద డెకాయిట్.. గాలిమీద కూడా పన్నులు పిండేస్తాడు
Also Read ;- అన్నా.. మళ్లీ ఎప్పుడు పుడతావు!