పవర స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తన నిర్మాణ సంస్థలో చరణ్ తో సినిమా చేస్తానని ప్రకటించారు. ఇలా బాబాయ్ – అబ్బాయ్ కాంబినేషన్ లో మూవీ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు.
దీంతో ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ, భారీ మల్టీస్టారర్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ భారీ మల్టీస్టారర్ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ ను గ్రేట్ డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నారట. ఆయన కమల్ హాసన్ తో ఇండియన్ 2 స్టార్ట్ చేశారు. కమల్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అందుచేత ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఆగింది.
ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి టైమ్ పట్టచ్చు. అందుచేత శంకర్.. పవన్ – చరణ్ కాంబినేషన్ లో మూవీ చేయాలి అనుకుంటున్నారట. చరణ్ కి ఆల్రెడీ కథ చెప్పడం.. శంకర్ చెప్పిన కథకి ఓకే చెప్పడం జరిగిందట. ఇక పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాలి. పవన్ కూడా ఈ స్టోరీకి ఓకే అంటే.. ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అంటున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని నిర్మించనున్నారని సమాచారం. మరి.. ఇదే కనుక నిజమైతే.. మెగా ఫ్యాన్స్ కి పండగే.
Must Read ;- బాబాయ్ నిర్మాతగా.. అబ్బాయి హీరోగా సినిమా











