సౌత్ లో అందంలోనూ, అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో ఎప్పుడూ వినిపించే పేరు మల్లూ కుట్టి నిత్యా మీనన్. కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ షోస్ ఏమీ చేయకుండా కేవలం పెర్ఫార్మెన్స్ తోనే ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ నిత్యా. మదర్ ల్యాండ్ మాలీవుడ్ లో లిమిటెడ్ గానే సినిమాలు చేసిన ఈ సుందరి.. తమిళ, తెలుగు సినిమాల్లో బెస్ట్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘నిన్నిలా నిన్నిలా, గమనం’ అనే సినిమాలతో టాలీవుడ్ లోనూ, ‘కోలాంబి’ అనే మూవీతో మలయాళంలోనూ మాత్రమే నటిస్తోంది నిత్యామీనన్.
కొంతకాలంగా… టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోనూ సెకండ్ హీరోయిన్ రోల్స్ కే పరిమితమైంది నిత్యామీనన్ . దానికి ఒక ఒకే కారణం ఆమె శరీరాన్ని భారీగా పెంచేయడమే. నిజానికి గ్లామరస్ బొద్దుగుమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే కోలీవుడ్ జనం.. ఆ క్వాలిఫికేషన్ ఉన్నా సరే.. ఆమె గ్లామర్ ఒలికించదు కాబట్టి.. కేవలం ఆమెను పెర్ఫార్మర్ గా చూడానికి అంతగా ఆసక్తి చూపలేదన్నది వాస్తవం. తెలుగులో కూడా ఇదే కారణంతో నిత్యా వెనుకబడింది.
అలాంటి నిత్యామీనన్ .. ఇప్పుడు పూర్తిగా తన స్వరూపాన్నే మార్చేసుకుంది. అందరూ షాకయ్యే స్లిమ్ మేకోవర్ తో మెప్పిస్తోంది. ఇది వరకటి నిత్యాకి, ఇప్పటి నిత్యాకి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. బ్రైడల్ గార్మెంట్స్ తో రివీలైన నిత్యా ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అవతారంలోనే ఆమె ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల్లో కనిపిస్తుంది. దాంతో అమ్మడు ఈ మూవీస్ తో మళ్ళీ సౌత్ లో బిజీ అవుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Must Read ;- సోషల్ మీడియాను వేడెక్కిస్తోన్న ‘కాలా’ సుందరి