రత్తాలు రత్తాలు.. ఓసోసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు.. అంటూ.. రాయ్ లక్ష్మి అందాలపై పాట రాశాడు ఓ సినీ కవి. నిజంగా ఆమె అందాల్ని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ముఖ్యం సోషల్ మీడియాలోని కుర్రగాళ్ళకి. నిత్యం ఇన్ స్టాలో తన హాట్ ఫోటోస్ ను పోస్ట్ చేయనిదే నిద్రపట్టని రాయ్ లక్ష్మి.. ఆ ఫోటోలు పెట్టి కుర్రకారుని నిద్రపోనీయదు మరి.

రీసెంట్ గా రాయ్ లక్ష్మి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన సెన్సువల్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోస్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కుర్రకారులో అగ్గిరాజేస్తూ ఉన్నాయి. బ్లాక్ డిజైనర్ సూట్ లో రాయ్ లక్ష్మి అందాలు, థై షో అబ్బో అనిపిస్తున్నాయి. నిజానికి ఈ మధ్యకాలంలో రాయ్ అంతటి స్థాయిలో హాట్ గా ఎప్పుడూ ఎలివేట్ కాలేదు.

కాంచనమాల కేబుల్ టీవీ సినిమా తో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మి .. ఆ తర్వాత మరికొన్ని సినిమాలతోనూ గుర్తింపు తెచ్చుకొని ప్రయత్నం చేసింది. అలాగే.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. బాలీవుడ్లోనూ ఓ రాయి విసిరింది.
Must Read ;- బికినీ అందాలతో మతిపొగొడుతోన్న మలయాళ ముద్దుగుమ్మ

అయితే ఎన్ని భాషల్లో ట్రై చేసినప్పటికీ.. ఆమెకి హీరోయిన్ గా కన్నా.. ఐటెమ్ గాళ్ గానే జనం గుర్తించారు. అందుకే రాయ్ లక్ష్మి అందుకు తగ్గట్టుగానే.. సోషల్ మీడియాలో హాట్ నెస్ తో కుర్రకారును అలరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.











