టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఓ వైపు సినిమాల్లోను, మరో వైపు వెబ్ సిరీస్ ల్లోను నటిస్తూ.. కెరీర్ లో దూసుకెళుతోంది. నటకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది. యూటర్న్, రంగస్థలం, ఓ బేబి.. ఇలా విభిన్న పాత్రలు పోషిస్తున్న సమంత తాజాగా హిస్టారికల్ మూవీ శాకుంతలం సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందే ఈ భారీ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.
ఇక సౌత్ నెం1 హీరోయిన్ అయిన సమంతకు కూడా ఓ డ్రీమ్ కాంబినేషన్ ఉందట. అది ఏంటంటే.. ఎప్పటికైనా తమిళ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి నటించాలని.. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతారతో కూడా కలిసి నటించాలని. తన కల గురించి గతంలో ఓ ఇంటర్ వ్యూలో తెలియచేసింది సమంత. ఇప్పుడు సమంత కల నెరవేరుతోంది. అవును.. తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెల్సిందే.
ఇందులో విజయ్ సేతుపతి, నయనతార కూడా నటిస్తున్నారు. ఇదో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని సమాచారం. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, సమంత.. ఇలా భారీ తారాగణంతో రూపొందుతుండడంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకాభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంది. సమ్మర్ కి షూటింగ్ పూర్తవుతుంది. మరి.. తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుటుందో చూడాలి.
Must Read ;- పాన్ ఇండియా దిశగా శాకుంతలం